మహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు వైష్ణవాలయాలకు తరలివస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారి నుంచే ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు , అభిషేకాలు స్వామి వారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. మహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు వైష్ణవాలయాలకు తరలివస్తున్నారు.
పవిత్ర ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే వైకుంఠ ఏకాదశి రోజున భగవంతుడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తిరుమల , శ్రీరంగం, పండరీపుర లాంటి వైష్ణవ ఆలయాల్లో శ్రీ హరి నామాలతో మారుమోగుతుంటుంది. ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం ఆలయాల్లో ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని తమ పాపాలు పోయి ముక్తి దొరుకుతుందని ప్రతీతి.