పరిమిత కాలం నియామకమే అయినప్పటికీ శారీరక, మానసిక సామర్థ్యాల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని అధికారులు తెలిపారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారత వాయుసేన లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అగ్ని పథ్ స్కీంలో భాగంగా చేపట్టే ఈ నియామకం నాలుగేళ్లకు మాత్రమే పరిమితం. జస్ట్ టెంపరరీ ఉద్యోగాలు. ఇంటర్ లేదా తత్సమాన కోర్సులు పూర్తిచేసిన పెళ్లి కాని అమ్మాయిలు , అబ్బాయిలు ఈ ఉద్యోగానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులను అగ్నివీర్ లుగా వ్యవహరిస్తారు. నాలుగేళ్ల పాటు వాయుసేనలో సేవలందించాల్సి ఉంటుంది. పరిమిత కాలం నియామకమే అయినప్పటికీ శారీరక, మానసిక సామర్థ్యాల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని అధికారులు తెలిపారు.
అగ్నివీర్ ల నియామకానికి సంబంధించి వాయు సేన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 27 తో ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్. వాయుసేన అఫిషియల్ వెబ్ సైట్ https://agnipathvayu.cdac.in/AV/ లో సంప్రదించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చిలో పరీక్ష నిర్వహించి నవంబర్ లో తుది ఫలితాలను ప్రకటిస్తారు.
విద్యార్హత: కనీసం 50% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్/ తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్
వయోపరిమితి: 1-1-2005 నుంచి 1-07-2008 మధ్య జన్మించి ఉండాలి.