ఈ సినిమా సుకుమార్ వైఫ్ తబిత నిర్మిస్తున్నారు. చాలా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమాకు చాలా అవార్డులు కూడా దక్కాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పుష్ప -2 డైరక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సినిమా గాంధీ తాత చెట్టు సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పద్మావతి మల్లాది డైరక్టర్ గా చేస్తున్న ఈ సినిమా సుకుమార్ వైఫ్ తబిత నిర్మిస్తున్నారు. చాలా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమాకు చాలా అవార్డులు కూడా దక్కాయి.
ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ రోజు మహేష్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ''ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్‌గా, హృదయానికి హత్తుకునే విధంగా ఉంది. సుకృతికి, ఈ సినిమా టీమ్ అందరికి నా అభినందనలు'' అంటూ మహేశ్ బాబు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
గాంధీ సిద్దాంతాలను అనుసరిస్తూ తమ ఊరిని, తన తాతకు ఇష్టమైన చెట్టును ఓ అమ్మాయి ఎలా కాపాడుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నెల 24న చిత్రం విడుదల కాబోతుంది. పుష్ప -2 సుకుమార్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు కూతురు సినిమా సక్సస్ కొడితే పుష్ప -2 కంటే ఎక్కువ సక్సస్ ను ఎంజాయ్ చేస్తారు సుకుమార్.