Jobs: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే!

అర్హత గల అభ్యర్ధులు అధికార వెబ్ సైట్ https://www.sci.gov.in/ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 23 నగరాల్లో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.


Published Dec 09, 2024 11:26:00 AM
postImages/2024-12-09/1733723863_750x450368002supremecourt.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సుప్రీం కోర్టులో పలు ఖాళీలు భర్తీకి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. కోర్ మాస్టర్ , సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ,పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన రిలీజ్ చేసింది. మొత్తం మూడు విభాగాల్లో మొత్తం 107 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ నెల 4 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా 25వ తేదీతో గడువు ముగుస్తుందని తెలిపింది. అర్హత గల అభ్యర్ధులు అధికార వెబ్ సైట్ https://www.sci.gov.in/ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 23 నగరాల్లో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.


ఖాళీలు:


కోర్ మాస్టర్ - 31


సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ - 33


పర్సనల్ అసిస్టెంట్ - 43


గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ , డిగ్రీతో పాటు టైపింగ్ స్పీడ్ 40 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. 


వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ


దరఖాస్తు విధానం, ఫీజు: సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి.


జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,000 నుంచి రూ. 67,000 వరకు జీతం చెల్లిస్తారు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu supremecourt jobs court

Related Articles