సినిమా మీద ఇంకా భారీ హైప్ ఉంది. ఒక మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్ .
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మరికొన్ని గంటలే ఉంది రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో సినిమా సందడి మొదలయ్యింది. ఇప్పటికే సినిమా మీద ఇండియా 2 సినిమా ఎఫెక్ట్ కాస్త ఉంది. శంకర్ సీన్ అయిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. అయితే సినిమా మీద ఇంకా భారీ హైప్ ఉంది. ఒక మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్ . మరో వైపు ఈ సినిమాలో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.
1. గేమ్ ఛేంజర్ సినిమా ఓపెనింగ్ సీనే ఒక యాక్షన్ సీన్ అని టాక్. అది కూడా శంకర్ డైరక్షన్ లో ఫైట్ భారీ యాక్షన్ సీన్. ఈ ఫైట్ మాస్ ఆడియన్స్ ను ఫిధా చేసేస్తుంది.
2. ఫస్ట్ హాఫ్ లో ఐఏఎస్ రామ్ నందన్ సీన్స్ ఉంటాయి.
3. సెకండ్ పార్ట్ లో సీనియర్ రామ్ చరణ్ స్టోరీ వస్తుంది.
యాక్షన్, పాటలు, డాన్స్ తో పాటు కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది.
ముఖ్యంగా ఆంధ్రా లో కనిపించే అభివృధ్ది పనులు కనిపిస్తాయట. ఇవి శంకర్ చాలా యేళ్ల క్రితం రాసుకున్నారు.ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి పనులలో.. ముఖ్యమైనవి రోడ్లు వేయడం, వాటర్ ఫెసిలిటీ లాంటివి కూడా చూపించడం తోపాటు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న హైడ్రా లాంటివి కూడా.. మొదటి భాగంలోనే కనిపిస్తాయి. అంతేకాదు ఇవన్నీ కూడా ఐఏఎస్ రామ్ నందన్ చేస్తాడట.
క్లైమాక్స్ కూడా ఏమాత్రం నిరాశపరచదు. శంకర్ స్టైల్ లోనే భారీ లెవెల్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారు.ఈ సినిమాకి, దిల్ రాజు ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేశారు . ఈ సినిమాలోని పాటల కోసమే రూ.90 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ మూవీ కోసం 65 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకున్నారట.చూడాలి మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో.