ప్రధానంగా ఈ నెల 10, 11, 12 తేదిల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సంక్రాంతి సందడి మొదలయ్యింది. ఇక పండుగకు ఇంటికి వెళ్లే వారి హంగామా కూడా షురూ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ పండుగకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 10, 11, 12 తేదిల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్్ లో చాలా రష్ గా ప్రాంతాల్లో ఎంజీబీఎస్ , జేబీఎస్ , ఉప్పల్ క్రాస్ రోడ్స్ , ఆరాంఘర్ , ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్ , కేపీ హెచ్ బీ , బోయిన్ పల్లి , గచ్చిబౌలి ప్రాంతాల్లో నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. ప్రయాణికుల కోసం దగ్గర్లో షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనుంది. సంక్రాంతి పండుగకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.50 వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది.
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో తిరిగే స్పెషల్ బస్సులకు ఈ సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 10,11,12 తేదీలు. రిటర్న్ జర్నీ 19,20 తేదీల్లో వచ్చేవారికి మాత్రమే ఈ సవరించిన బస్సు ఛార్జీలు లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది.