RAILWAY: రైల్వేలో 32,000 గ్రూప్​-డి జాబ్స్​ - ఆఖరి తేదీ ఇదే !

లెవల్ -1 పోస్టులకు  రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.


Published Dec 29, 2024 06:44:00 PM
postImages/2024-12-29/1735478172_66ff5ff7af499railwayrecruitment202408452637516x9.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రైల్వే శాఖలో గ్రూప్ -డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత , దరఖాస్తు విధానం , చివరితేదీ డీటైల్స్ చూసేద్దాం. భారత రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,000 గ్రూప్​-డి ఖాళీలను భర్తీ చేస్తోంది. 

లెవల్ -1 పోస్టులకు  రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.


పాయింట్స్​మన్​
అసిస్టెంట్
ట్రాక్​ మెయింటెయినర్
అసిస్టెంట్​ లోకోషెడ్
అసిస్టెంట్​ ఆపరేషన్స్​
తదితర ఖాళీలు ఉన్నాయి.


* అర్హత :
పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
దరఖాస్తు విధానం :
ఆన్​లైన్​
ఆన్​లైన్​ దరఖాస్తు ప్రక్రియ :
జనవరి 23న ప్రారంభమై ఫిబ్రవరి22న ముగుస్తుంది.
ఆర్​ఆర్​బీ రీజియన్లు :
అహ్మదాబాద్​, బెంగళూరు, అజ్​మేర్, భువనేశ్వర్, భోపాల్​, బిలాస్​పూర్, చండీగఢ్, చైన్నై, గోరక్​పూర్, కోల్​కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్​రాజ్, రాంచీ, సికింద్రాబాద్​. 
ఏయే విభాగాల్లోనంటే :
ఇంజినీరింగ్, ట్రాఫిక్, మెకానికల్, ఎలక్ట్రికల్ మొదలైనవి.
వయోపరిమితి(Age limit) :
01-07-2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనలననుసరించి ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.


కంప్యూటర్ ఆధారిత పరీక్ష (కంప్యూటర్​ బేస్​డ్​ టెస్ట్​), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (ఫిజికల్​ ఎఫీషియన్సీ టెస్ట్​), డాక్యుమెంట్ వెరిఫికేషన్(సర్టిఫికెట్​ వెరిఫికేషన్), మెడికల్ ఎగ్జామినేషన్(మెడికల్​ టెస్ట్​) తదితరాల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.


అప్లికేషన్ ఫీజు :
ఈడబ్ల్యూఎస్‌, జనరల్, ఓబీసీ కేటగిరీ, అభ్యర్థుల్కు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులకు రూ.250.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu railway-department jobs

Related Articles