Death Clock: మీ డెత్ డేట్ చెప్పేసే యాప్ ...సెకన్ లో మీ లాస్ట్ మినిట్ ఏంటో చెప్పేస్తుంది !

సైన్స్ తో ఆకాశంలో తర్వాత ఏం చెయ్యాలో కూడా చెప్పేసే రోజుల్లో ఉన్నాం. సైన్స్ ..ఇదంతా సైన్స్ ..టెక్నాలజీ . అయితే ఇప్పుడు డెత్ క్యాలండర్ యాప్ కూడా వచ్చేసిందంటున్నారు సైంటిస్టులు. 


Published Dec 01, 2024 02:03:00 PM
postImages/2024-12-01/1733042083_aideath.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: డెలివరీ డేట్ అయిన చెప్పొచ్చు కాని చావుకు డేట్ చెప్పలేం. అదే తెలిస్తే కొన్ని వేల కుటుంబాలు సడన్ గా రోడ్డున పడవు. కొన్ని వేల జీవితాలు సడన్ గా అర్ధాంతరంగా చిన్నా భిన్నం కావు. ఇదేనేమో సృష్టి . అయితే ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి..సైన్స్ తో ఆకాశంలో తర్వాత ఏం చెయ్యాలో కూడా చెప్పేసే రోజుల్లో ఉన్నాం. సైన్స్ ..ఇదంతా సైన్స్ ..టెక్నాలజీ . అయితే ఇప్పుడు డెత్ క్యాలండర్ యాప్ కూడా వచ్చేసిందంటున్నారు సైంటిస్టులు. 


అమెరికాకు చెందిన ఓ కంపెనీ మీరు తినే తిండి, రోజువారీగా చేసే పనులు, ఇతరత్రా అలవాట్ల గురించి చెబితే మీ మరణం మిమ్మల్ని ఎప్పుడు పలకరిస్తుందో దాదాపు కచ్చితంగా చెప్పేస్తామని దీమా వ్యక్తం చేస్తోంది. దీని కోసం స్పెషల్ గా ఓ యాప్ ను కూడా క్రియేట్ చేసింది. 


అమెరికాకు చెందిన సెన్సర్ టవర్ కంపెనీ ‘డెత్ క్లాక్’ యాప్ ను తయారుచేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో  రూపొందించిన ఈ యాప్ చావును ముందుగానే అంచనా వేసి చెబుతుందట. మరణించే తేదీ గురించి అంచనా తెలిశాక మనకు తెలియకుండానే ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందని, ఆరోగ్యకరమైన అలవాట్లను తప్పనిసరిగా అలవాటు చేసుకుని హెల్తీ లైఫ్ లీడ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu artificial-intelligence life-style family-death

Related Articles