వెయిట్ లాస్ కు ఏం స్నాక్స్ తీసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కాని ఈ ఫ్రూట్స్ కాని స్నాక్స్ లాగా తీసుకుంటే ..మీకు సూపర్ వెయిట్ లాస్ రిజల్ట్ కనిపిస్తుంది.
న్యూస్ లైన్, స్పెష్ల్ డెస్క్: ఇప్పుడు జనాల్లో చాలా మందికి ఉన్న పెద్ద సమస్య ఓవర్ వెయిట్ . తగ్గాలనుకున్నా ..తగ్గలేం ..ఎన్నేళ్లు ప్రయత్నించాలి వెయిట్ లాస్ కు ఏం స్నాక్స్ తీసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కాని ఈ ఫ్రూట్స్ కాని స్నాక్స్ లాగా తీసుకుంటే ..మీకు సూపర్ వెయిట్ లాస్ రిజల్ట్ కనిపిస్తుంది.
* జామ పండులో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతీ 100 గ్రాముల జామలో 68 క్యాలరీలు ఉంటాయి. ఇందులోని ఫైబర్ కారణంగా.. కడుపు నిండుగా మారిపోయి ఎక్కువగా తినకుండా ఉంటారు.మీరు ఆగకుండా రోజంతా తిన్నా ...కూడా దీని వల్ల మీకు వెయిట్ తగ్గడమే కాని పెరగడం ఉండదు. పొట్ట కూడా ఫుల్ అవుతుంది.
* పుచ్చకాయ దీనిలో 90 శాతం నీరు ఉంటుంది. విటమిన్ ఎ, సి, పొటాషియం ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని లంచ్ కన్నా ముందు తీసుకోవడం మంచిది. మీరు వెయిట్ తగ్గాలంటే ఫస్ట్ ఆప్షన్ వాటర్ మిలన్ . ఇది మీకు అందించాల్సిన ఫైబర్ ను అందిస్తూనే ..పొట్టను చాలా లైట్ చేసేస్తుంది.
*నారింజ ప్రతీ 100 గ్రాముల నారింజలో 47 క్యాలరీలు ఉంటాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ కల నారింజ తినడం వల్ల ఆకలి తొందరగా వేయదు. అందులో సిట్నిక్ యాసిడ్ ఫ్రూట్స్ వల్ల చాలా ఎక్కువ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది.
* పైనాపిల్ విటమిన్ సి తో పాటు మ్యాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా పైనాపిల్ లో ఉంటాయి. ఇందులో నీటి శాతం, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీని లో ఉండే పులుపు మీకు ఏ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది.
* ఆపిల్ ప్రతీ 100 గ్రాముల యాపిల్ లో 52 క్యాలరీలు ఉంటాయి. ఫైబర్ విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఆపిల్ ని రోజూ సాయంత్రం తినడం మంచిది. ఇవే కాదు మీకు మొలకలు...పెసలు..వేరుశెనగ, శెనగలు లాంటివి కూడా తీసుకుంటే ప్రొటీన్ సరిగ్గా ఉండి చక్కగా సన్నబడతారు.