Fastest Internet: హై స్పీడ్ నెట్ అందిస్తున్న దేశాలివే ...భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా ?

ప్రపంచంలోని 10 వేగవంతమైన ఇంటర్నెట్ అందించే దేశాలు గురించి తెలుసుకుందాం.


Published Dec 08, 2024 05:28:00 PM
postImages/2024-12-08/1733659277_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రీసెంట్ గా ప్రపంచ బ్యాంకు ఓ నివేదికను సమర్పించింది. అందులో ఇంటర్నెట్ డీటైల్స్ ఉన్నాయి. ఏ దేశం ఎంత హై స్పీడ్ డేటాను అందిస్తున్నారనేదే ఈ నివేదిక ముఖ్య ఉద్దేశ్యం. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటే అంతే ఎక్కువ డిజిటల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్లు. ఒక రకంగా మొబైల్ ఇంటర్నెట్ జీవితంలో భాగమైపోయిందని చెప్పొచ్చు. ఆన్‌లైన్‌లో పని చేయడం, వీడియోలను ప్రసారం చేయడం, సోషల్ మీడియాను ఉపయోగించడం, వేగవంతమైన ఇంటర్నెట్ వేగం చాలా ముఖ్యం. . ప్రపంచంలోని 10 వేగవంతమైన ఇంటర్నెట్ అందించే దేశాలు గురించి తెలుసుకుందాం.


* ప్రపంచ బ్యాంకు ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE): మొబైల్ ఇంటర్నెట్ వేగం 398.51 Mbpsతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 


* ఖతార్ రెండవ స్థానంలో ఉంది344.34 Mbps మొబైల్ ఇంటర్నెట్ వేగంతో రెండవ స్థతానంలో నిలిచింది.


*కువైట్ 239.83 Mbps మొబైల్ ఇంటర్నెట్ వేగంతో మూడవ స్థానంలో నిలిచింది.


*దక్షిణ కొరియా నాల్గవ స్థానంలో నిలిచింది. 133.44 Mbps మొబైల్ ఇంటర్నెట్ వేగంతో నెదర్లాండ్స్ ఐదవ స్థానంలో నిలిచింది. మొబైల్ ఇంటర్నెట్ వేగం 130.05 Mbpsతో డెన్మార్క్ ఆరో స్థానంలో నిలిచింది. అలాగే 128.77 ఎంబీపీఎస్‌తో నార్వే ఏడో స్థానంలో నిలిచింది. భారత్ 47 వ స్థానంలో ఉంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu online socialmedia network

Related Articles