మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పుచ్చకాయ త్వరగా పండాలని కార్బైడ్ ఇంజక్షన్లు చేస్తున్నారని చెప్పారు. కాబట్టి పుచ్చకాయలను జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాలని అన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించే అధ్భుతమైన ఫలం పుచ్చకాయ..పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా ఆరగించే ఈ పండులోనూ కల్తీ జరుగుతుందని ఆర్టిఫిషియల్ కలర్స్ తో ఎర్రగా కనిపించేలా చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పుచ్చకాయ త్వరగా పండాలని కార్బైడ్ ఇంజక్షన్లు చేస్తున్నారని చెప్పారు. కాబట్టి పుచ్చకాయలను జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాలని అన్నారు.
పుచ్చకాయలు లోపల ఎర్రగా కనిపించేందుకు కొంతమంది వ్యాపారులు ఎరిథ్రోసిన్ అనే రసాయనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారట. ఇలా కల్తీ జరిగిన పుచ్చకాయ తినడం వల్ల శరీరంలోకి ఎరిథ్రోసిన్ చేరి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడాల్సి వస్తుంది.ఎరిథ్రోసిస్ ఓవర్ గా బ్లడ్ లో కలిస్తే క్యాన్సర్ కణాలు కూడా వృధ్ధి చెందుతాయి.
ఎరిథ్రోసిస్ ను ఇంజెక్ట్ చేసి పండించిన పుచ్చకాయను గుర్తించడానికి సింపుల్ టెస్ట్ ను నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ కొనడానికి ముందు ఓ ముక్క కోసి ఇమ్మని , టిష్యూ పేపర్ తో ఆ ముక్కను అక్కడక్కడా టచ్ చెయ్యండి. టిష్యూకి రెడ్ కలర్ అంటుకోకపోతే మంచి పుచ్చకాయ ..లేకపోతే అది ఎరిథ్రోసిస్ కలిపిన పుచ్చకాయ.