మొదట్లో కొరియన్ ప్రజలు వెదురు ఉప్పును వాడేవారు. అందుకే దీనిని కొరియన్ సాల్ట్‌గా కూడా పిలుస్తారు. ఈ ఉప్పు వెదురు బొంగులో తయారుచేస్తారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఉప్పు ధర అంత ఉంటుందా...ఏంటి అంత స్పెషల్ ...అంటారా ..నిజానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఉప్పు కొరియా లో చాలా ఫేమస్. వెదురు ఉప్పు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వెదురు ఉప్పు రేట్లు ...మార్కెట్లో కేజీ రూ.20వేలు- రూ.30వేలు వరకు ఉంటుంది.ఈ ఉప్పును మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.
ప్రస్తుతం వెదురు ఉప్పు తయారీపై ట్రయల్స్ చేస్తున్నారు. ట్రయల్స్ పూర్తైన తర్వాత ఈ ఉప్పును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఉప్పును తయరుచెయ్యొచ్చు.మొదట్లో కొరియన్ ప్రజలు వెదురు ఉప్పును వాడేవారు. అందుకే దీనిని కొరియన్ సాల్ట్‌గా కూడా పిలుస్తారు. ఈ ఉప్పు వెదురు బొంగులో తయారుచేస్తారు.
తొలుత వెదురు బొంగుల్లో సముద్రపు ఉప్పును నింపుతారు ఈ వెదురు బొంగులను 300- 400 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాల్చుతారు. తొమ్మిదో సారి ఉప్పుని కాల్చిన తర్వాత స్పటిక రూపంలోకి మారుతుంది. దీనిని వెదురు ఉప్పు అంటారు. అంతర్జాతీయ మార్కెట్లోని ధరల కంటే తాము తయారుచేసిన బాంబు సాల్ట్‌ను తక్కువ ధరకు అందిచాలని ఉత్తరాఖండ్ సర్కార్ యోచిస్తోంది. ఈ సాల్ట్ ఎందుకింత రేటు అంటే ...కిలో ఉప్పు తయారుచేయడానికి దాదాపు 20 రోజులు అవుతుంది. అందుకే ఈ ఉప్పు ఇంత రేటు. పోషకాలు, 73 మినరల్స్ ఉంటాయి. ఇక వెదురు ఉప్పు జీర్ణక్రియ సమస్యలకు బాగా పనిచేస్తుంది. ఎసిడిటీ, యూరిక్ యాసిడ్ వంటి సమస్యలను కూడా నివారిస్తుందని పేర్కొన్నారు.