24 గంటల్లో ఈ ప్రాంతంలో భూకంపం రావడం ఇది రెండో సారి . అయితే పెద్ద గా ఆస్తి నష్టం కాని ప్రాణ నష్టం కాని జరగలేదు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : జమ్ము కాశ్మీర్ లో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంగా గుర్తించార. నేషనల్ సిస్మోలజీ సెంటర్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని సమాచారం. భూకంపం కారణంగా హిమాలయ ప్రాంతాలతో పాటు చాలా చోట్ల ఈ ప్రకంపనలు కలిగాయి . గత 24 గంటల్లో ఈ ప్రాంతంలో భూకంపం రావడం ఇది రెండో సారి . అయితే పెద్ద గా ఆస్తి నష్టం కాని ప్రాణ నష్టం కాని జరగలేదు.
సమాచారం ప్రకారం, భూకంపం కేంద్రం 209 కిలోమీటర్ల లోతులో ఉంది. దీని కోఆర్డినేట్లు 71.32 డిగ్రీల తూర్పు రేఖాంశం, 36.62 డిగ్రీల ఉత్తర అక్షాంశం. దీని ప్రభావంతో జమ్మూకశ్మీర్‌లో కూడా భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా అలర్ట్ ప్రకటించారు.
నిజానికి నవంబర్ 26న జపాన్‌లో భూకంపం సంభవించింది. జపాన్ ఉత్తర - మధ్య ప్రాంతంలోని నోటో ద్వీప కల్పంలో రాత్రి 10.47 గంటలకు 10 కీమీ లోతులో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే సునామీ ముప్పు మాత్రం లేదు కాబట్టి ఎలాంటి నష్టం జరగలేదు.