మరణించిన జవానును జస్వీందర్ సింగ్ గా గుర్తించారు. అతడు 34 అస్సామ్ రైఫిల్స్ రెజిమెంట్ కు చెందినవాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది ఉగ్రవాదుల కోసం సైన్యం చేసిన సెర్చ్ ఆపరేషన్ లో ఓ జవాన్ గుండెపోటుతో చనిపోయాడు. మరణించిన జవానును జస్వీందర్ సింగ్ గా గుర్తించారు. అతడు 34 అస్సామ్ రైఫిల్స్ రెజిమెంట్ కు చెందినవాడు.
ఈ ఉదయం ఫఖీర్ గుజ్రీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. సడన్ గా అతడ్ని బతికించేందుకు సైన్యం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జస్వీందర్ సింగ్ మృతితో అతడి రెజిమెంట్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.అయితే ప్రతి వారం జరిగిన ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టుల్లో అతను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడని ..ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కావడం లేదని అంటున్నారు అధికారులు. తన పార్ధివదేహాన్ని అధికారిక లాంఛనాలతో తమ గ్రామానికి చేరుస్తామని తెలిపారు.