పక్కనే ఓ కోచింగ్ ఇన్ స్టిట్యూట్ ఉండగా, అందులోని విద్యార్థులు అగ్నిప్రమాదం నుంచి తప్పించుకున్న తీరు వైరల్ అయింది. విద్యార్ధులు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి రాజౌరీ గార్డెన్ మార్కెట్ లోని జంగిల్ అంబోరీ రెస్టారెంట్ లో మంటలు చెలరేగి, కొద్దిసేపట్లోనే తీవ్ర రూపు దాల్చాయి. పక్కనే ఓ కోచింగ్ ఇన్ స్టిట్యూట్ ఉండగా, అందులోని విద్యార్థులు అగ్నిప్రమాదం నుంచి తప్పించుకున్న తీరు వైరల్ అయింది. విద్యార్ధులు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు.
జంగిల్ అంబోరీ రెస్టారెంట్లో ఈ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించింది. రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటన్నది తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండచ్చని అంచనా వేస్తున్నారు.
అగ్నిప్రమాదం కారణంగా రాజౌరీ గార్డెన్ ప్రాంతమంతా పొగతో నిండిపోవడంతో, స్థానికులు ఇబ్బంది పడ్డారు. కాగా, ఈ అగ్నిప్రమాదం, విద్యార్థులు సురక్షితంగా బయటపడడం తాలూకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విరివిగా దర్శనమిస్తున్నాయి.
Tags : newslinetelugu fire-accident delhi hotel