జిల్లా పరిషత్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నాడు. బైక్ నుడపుతుండగా సడన్ గా ప్యాంట్ పాకెట్ లో సెల్ ఫోన్ పేలింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ప్యాంటుజేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలడంతో తీవ్రంగా గాయపడ్డారు. సకోలి తాలూకా సంగడీలో ఈ ఘటన జరిగింది. ఆయన పేరు సురేశ్ సంగ్రామ్. వయసు 55 ఏళ్లు. జిల్లా పరిషత్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నాడు. బైక్ నుడపుతుండగా సడన్ గా ప్యాంట్ పాకెట్ లో సెల్ ఫోన్ పేలింది.
సడన్ గా ఫోన్ పేలడంతో డ్రైవింగ్ లో ఉండగా సెల్ ఫోన్ పేలడంతో .. చాలా ఫోర్స్ ఫుల్ గా నేల మీద పడ్డారు. కాగా, చికిత్స పొందుతూ సంగ్రామ్ కన్నుమూశారు. సంగ్రామ్ ఫోన్ బాగా హీట్ ఎక్కిపోయి పేలిపోయిందని తెలుస్తోంది. జేబులో ఉన్న సెల్ ఫోన్ బాంబులా పేలిపోవడం స్థానికంగా సంచలనం రేపింది. కాగా, ఫోన్ బ్యాటరీ ఓవర్ హీట్ కావడం వల్లే ఫోన్ పేలి పోయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఎక్కువ సేపు ఫోన్ ని ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ పేలిపోయే ప్రమాదాలు అధికశాతం ఉన్నాయంటున్నారు. ఇక ఎక్కువ సేపు ఫోన్ ను ఎండకు, సూర్యరశ్మికి గురి చేయడం వల్ల బ్యాటరీ వేడెక్కిపోయి ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి పొరపాట్ల వల్ల బ్యాటరీ వేడెక్కిపోయి ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉందంటున్నారు.