ఇదే ఉత్సవంలో ఒక రథం బోల్తా పడి, పార్క్ చేసిన అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఆ సందర్భంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కర్ణాటకలోని దొడ్డనగమంగళ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 150 అడుగుల ఎత్తైన భారీ రథం ఊరేగిస్తుండగా గాలి వాన భీభత్సం సృష్టించింది. దీంతో అమ్మవారి రథం పక్కకు ఒరిగిపోయి ..కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు చనిపోయారు. హుస్కూరు మద్దురమ్మ జాతరలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు భక్తులు అక్కడిక్కడే చనిపోయారు. ఇంకా రథం కింద చాలా మంది ఇరుక్కుపోయారు.గత సంవత్సరం కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇదే ఉత్సవంలో ఒక రథం బోల్తా పడి, పార్క్ చేసిన అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఆ సందర్భంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు.
ఈ పండుగలో స్థాయికి మించి రథం హైట్ ను పెంచుతున్నారని ...స్థానికులు విమర్శలు చేస్తున్నారు. రథం రూపకల్పనలోని నిర్మాణ లోపాలను ఎత్తి చూపారు. భారీ రథం కుప్పకూలడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు.దీనికి 10 కి పైగా గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం వస్తారు. వార్షిక ఊరేగింపు సమయంలో మతపరమైన వేడుకలో భాగంగా భారీ రథాలను లాగుతారు.