ఆ రాడ్డు వెయిట్ పడడంతో మెడ ఎముక విరిగిపోయిందని అందుకే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: చావు రాసిపెట్టి ఉంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా మరణం తప్పదు. ప్రమాదవశాత్తు ఓ యంగ్ వెయిట్ లిఫ్టర్ ఎంతో జాగ్రత్తగా నిపుణుల పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేస్తుండగా 270 కిలోల రాడ్డు మెడ మీద పడి చనిపోయింది. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో వెయిట్ లిఫ్టర్ యష్తిక ఆచార్య మృతి చెందింది. 17 ఏళ్ల ఆచార్య జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న టైంలో 270 కిలోల వెయిట్ ను ప్రాక్టీస్ చేస్తుంది. జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో చేస్తున్నా ..ప్రమాదం జరిగింది. అయితే ఆ రాడ్డు వెయిట్ పడడంతో మెడ ఎముక విరిగిపోయిందని అందుకే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆచార్య గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్ లో స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. ఈ ఘటన లో శిక్షకుడికి కూడా స్వల్పంగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
⚠️ Disturbing Visual ⚠️
राजस्थान : बीकानेर में पावरलिफ्टर याष्टिका आचार्य (उम्र 17 साल) की जिम में मौत हो गई। 270 किलो वजन उठाते वक्त रॉड गिरने से गर्दन की हड्डी टूट गई। pic.twitter.com/REt23agjwa — Sachin Gupta (@SachinGuptaUP) February 19, 2025