Traffic Restrictions: హైదరాబాద్ టు ఆంధ్రా వెళ్తున్నారా ..ఈ రూట్స్ ను క్లోజ్ చెక్ చేసుకొండి !

నల్గొండ జిల్లా పరిధిలోని దురాజ్ వల్లి లింగమంతుల స్వామి జాతర ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది. నిజానికి మేడారం తర్వాత జరిగే అతిపెద్ద జాతర.


Published Feb 16, 2025 12:39:00 PM
postImages/2025-02-16/1739689810_NH6501Vjpg442x2604g.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హైదరాబాద్ నుంచి విజయవాడ , ఖమ్మం వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్ . ఆదివారం తెల్లవారు నుంచి ఈ రూట్స్ వెళ్లే వెహికల్స్ ను పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి మరి వేరే రూట్ కు వెహికల్స్ ను మళ్లిస్తున్నారు. ఐదు రోజుల పాటు ఈ రూట్ లలో ఆంక్షలు అమల్లో ఉండే అవకాశం ఉంది. ఇంతకీ.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించడానికి కారణం ఏమిటంటే.. నల్గొండ జిల్లా పరిధిలోని దురాజ్ వల్లి లింగమంతుల స్వామి జాతర ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది. నిజానికి మేడారం తర్వాత జరిగే అతిపెద్ద జాతర.


 యాదవుల ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న ఈ లింగమంతుల జాతరను ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. మాఘమాసంలో తొలి ఆదివారం ప్రారంభమై ఐదు రోజుల పాటు జాతర జరుగుతుంది. మాఘమాసంలో తొలి ఆదివారం ప్రారంభమై ఐదు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. దీంతో ఇవాళ నుంచి 20 వ తేదీ వరకు జాతర జరగనుంది. ఓ లింగా అంటూ శివ నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగుతుంది.


మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, ఒడిశా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈసారి ఈ జాతరకు 20లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రి గంపల ప్రదక్షిణతో సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టెను తీసుకురావడంతో లింగమంతుల స్వామి జాతర ప్రారంభమవుతుంది . 


ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు పెద్దగట్టు జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu hyderabad khammam-floods

Related Articles