స్వీట్లను క్షణాల్లో తయారు చేసుకోవడం చాలా మంచిది . పది నిమిషాల్లో ఈజీగా చేసే స్వీట్ టేస్టీ ..టైమ్ సేవింగ్ కూడా.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ ఏడాది దీపావళికి మార్కెట్ నుంచి స్వీట్లు తెచ్చే బదులు ఇంట్లో నే ఈజీగా తయారుచేసిన స్వీట్లను క్షణాల్లో తయారు చేసుకోవడం చాలా మంచిది . పది నిమిషాల్లో ఈజీగా చేసే స్వీట్ టేస్టీ ..టైమ్ సేవింగ్ కూడా.
బ్రెడ్ స్వీట్ షాహీ తుక్డా రెసిపీకి కావల్సిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు - నాలుగు
నెయ్యి - నాలుగు స్పూన్లు
పంచదార - అయిదు స్పూన్లు
పిస్తా తరుగు - ఒక స్పూను
జీడిపప్పు తరుగు - ఒక స్పూను
బాదం తరుగు - ఒక స్పూను
ఫుల్ క్రీమ్ మిల్క్ - రెండు కప్పులు
యాలకుల పొడి - అరస్పూను
స్టవ్ మీద కడాయి పెట్టి ...బ్రెడ్ పీసెస్ ను నెయ్యిలో వేపండి. మరో వైపు మందపాటి గిన్నెలో పాలు మరిగించండి. చిక్కటి పాలు తీసుకొండి. వాటిని చిన్న మంట మీద పెట్టి గంట పాటు మరిగిస్తే అవి చిక్కగా మారుతాయి. రంగు కూడా మారుతాయి. ఆ పాలలో పంచదార, యాలకుల పొడి , కుంకుమపువ్వు వేసి కలపాలి. గుర్తుంచుకొండి పంచదార పొడి చేసుకొని కలుపుకొండి. ఫాస్ట్ గా పంచదార కలుగుతుంది. ఆ తర్వాత ఇందులో ముందుగా ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ ను వేసి ఉంచుకొండడి. ఇక గార్నిష్ మీ ఇష్టం..పిస్తా, బాదం , జీడిపప్పు ఇలా ఏవైనా వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచుకొని తినండి. సూపర్ గా ఉంటుంది.