ప్రపంచ సమీకరణాలు , సరిహద్దు దేశాలతో వ్యూహాత్మక వైఖరికి కావాల్సిన సరికొత్త ఆయుధాలు , సైన్యాన్ని మరింత పటిష్టం చెయ్యడానికి ఈ రంగానికి భారీ కేటాయింపులు చేశారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డీయే కూటమి సభ్యుల హర్షధ్వనాల మధ్య పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.రికార్డు స్థాయి బడ్జెట్ తో దాదాపు రూ.50,65,345 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సారి రక్షణ రంగానికి పెద్ద పీట వేశారు . రూ.4.91 లక్షల కోట్లతో అత్యధిక కేటాయింపులు చేశారు. ప్రపంచ సమీకరణాలు , సరిహద్దు దేశాలతో వ్యూహాత్మక వైఖరికి కావాల్సిన సరికొత్త ఆయుధాలు , సైన్యాన్ని మరింత పటిష్టం చెయ్యడానికి ఈ రంగానికి భారీ కేటాయింపులు చేశారు
* రక్షణ రంగం- రూ.4,91,732 కోట్లు
* గ్రామీణాభివృద్ధి- రూ.2,66,817 కోట్లు
* హోంశాఖ- రూ.2,33,211 కోట్లు
* వ్యవసాయం, అనుబంధ రంగాలు- రూ.1,71,437 కోట్లు
* విద్యా రంగం- రూ.1,28,650 కోట్లు
* ఆరోగ్య రంగం- రూ.98,311 కోట్లు
* పట్టణాభివృద్ధి- రూ.96,777 కోట్లు
* ఐటీ, టెలికాం రంగం- రూ.95,298 కోట్లు
* ఇంధన రంగం- రూ.81,174 కోట్లు
* పారిశ్రామిక, వాణిజ్య రంగాలు- రూ.65,553 కోట్లు
* సామాజిక సంక్షేమ రంగం- రూ.60,052 కోట్లు
* శాస్త్ర సాంకేతిక రంగం- రూ.55,679 కోట్లు