ఆ జట్టులోని సీనియర్ ప్లేయర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న భారత్ , పాకిస్థాన్ మ్యాచ్ రేపే మొదలవుతుంది. మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచి మంచి ఊపుమీదున్న టీమిండియాను , తమ మ్యాచ్ ఓటమితో కంగుతిన్న ఆతిథ్యపాక్ ను డీల్ చెయ్యడం భారత్ కు అంత కష్టపమైన పని కాదని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.
"పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పాకిస్థాన్ పూర్తిగా వెనుకబడింది. మోడర్న్ డే క్రికెట్ ఆడటంలో ఆ దేశ ఆటగాళ్లు విపలమవుతున్నారు.ఆ జట్టులోని సీనియర్ ప్లేయర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. నిజానికి ఇలా దాయాదుల పోటీల్లో ప్రెజర్ , టెన్షన్ , అభిమానుల రచ్చ అంతా కామన్ . కాని వాటిని కరెక్ట్ గా హ్యాండిల్ చేసేవారికి కప్ వరిస్తుందని తెలిపారు.
గాయం తర్వాత కమ్ బ్యాక్ చేసిన మహ్మద్ షమీ తొలి మ్యాచ్ లోనే ఐదు వికెట్లతో సత్తాచాటాడు . షమీ ఐసీసీ ఈవెంట్లు అంటే తెలియని బలం తెచ్చుకొని ఆడుతాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. అటు కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్ అందుకోవడం జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. రోహిత్, విరాట్ కోహ్లీ రన్స్ కొట్టడం మొదలు పెడితే వారిని ఆపడం ఎవరితరమూ కాదు" అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.