Champions Trophy 2025: చివరి లీగ్ లో 179 కే కుప్పకూలిన ఇంగ్లాండ్ !

ఈ గ్రూప్ బి పోరులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి బట్లర్ సేన 38.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది.


Published Mar 01, 2025 06:31:00 PM
postImages/2025-03-01/1740834156_iccmenschampionstrophygroupbenglandvsouthafrica.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇప్పటికే ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు ఈ రోజు తన చివరి లీగ్  మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. పాకిస్థాన్ లోని కరాచీలో జరుగుతున్న ఈ గ్రూప్ బి పోరులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి బట్లర్ సేన 38.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. సీనియర్ ప్లేయర్ ఆటగాడు జో రూట్ చేసిన 37 పరుగులే ఆ జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోర్ . చివర్లో జోఫ్రా ఆర్చర్ 25 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.


ఓపెనర్ బెన్ డకెట్ 24, కెప్టెన్ జోస్ బట్లర్ 21, హ్యారీ బ్రూక్ 19 పరుగులు చేశారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0), వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జేమీ స్మిత్ (0) డకౌట్ అయ్యారు. సఫారీ బౌలర్లలో మార్కో యన్సెన్ 3, వియాన్ ముల్డర్ 3, కేశవ్ మహరాజ్ 2, లుంగి ఎంగిడి 1, రబాడా 1 వికెట్ తీశారు.

newsline-whatsapp-channel
Tags : cricket-news england championship-trophy

Related Articles