ND vs PAK : అసలు గేమ్ గెలిచేవాళ్లమే..కాని జస్ట్ మిస్ !

మెరుగైన రన్ రేటు కలిగిన జట్టు సెమీస్ కు చేరుకుంటుంది. ఇప్ప‌టికే గ్రూప్‌-ఏ నుంచి భార‌త్ దాదాపుగా సెమీస్‌కు చేరుకుంది.


Published Feb 24, 2025 10:45:00 AM
postImages/2025-02-24/1740374186_MohammadRizwanCommentsAfterlosstoIndiaInChampionsTrophy2025.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది.ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో పాక్‌కు వ‌రుస‌గా ఇది రెండో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం. పాకిస్థాన్ ఈ లాస్ తో దాదాపు ఇంటికి వచ్చేసినట్లే. టెక్నికల్ గా ఆ జ‌ట్టు సెమీస్ రేసులో ఉంది.న్యూజిలాండ్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవ‌డంతో పాటు బంగ్లాదేశ్ పై పాక్ అతి భారీ తేడాతో గెల‌వాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ , పాకిస్థాన్ , న్యూజిలాండ్ , పాయింట్లు సమానంగా ఉంటాయి. మెరుగైన రన్ రేటు కలిగిన జట్టు సెమీస్ కు చేరుకుంటుంది. ఇప్ప‌టికే గ్రూప్‌-ఏ నుంచి భార‌త్ దాదాపుగా సెమీస్‌కు చేరుకుంది.


కాని పాకిస్థాన్ భారత్ పై ఓడిపోవడానికి చాలా రీజన్లు చెప్పారు రిజ్వాన్. టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. 49.4 ఓవ‌ర్ల‌లో 241 ప‌రుగుల‌కు ఆలౌటైంది.  కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బాగా రాణించాడు. కాని మేం గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయాం. తను చివరి వరకు ఆడాలనుకున్నాను. కాని మేం బరిలో నిలవలేకపోయాం. కొహ్లీ  చాలా బాగా ఆడారు. కాని మా చెత్త షాట్స్ తో మేం ఓడిపోయాం. 


బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా మూడు విభాగాల్లో విఫ‌లం అయిన‌ట్లు రిజ్వాన్ అంగీక‌రించాడు. కోహ్లీ, గిల్ లు అద్భుతంగా ఆడార‌ని మెచ్చుకున్నాడు. వారిద్ద‌రు మ్యాచ్‌ను త‌మ నుంచి లాగేసుకున్నార‌న్నాడు. మేం ఫీల్డీంగ్ లో చాలా మెరుగు అవ్వాల్సి ఉంది. ఈ మ్యాచ్ లోనూ గత మ్యాచ్ లోను ఫీల్డింగ్ లో చాలా తప్పులు చేశాం. మేం మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తామంటూ తమ ఓటమికి కారణాలు తెలిపారు రిజ్వాన్ 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu india championship-trophy pakistan

Related Articles