car: ఇక పై నో ట్రాఫిక్ టెన్షన్స్ ...గాల్లో ఎగిరే కార్ !

ఈ కార్ లో నాలుగు చిన్న ఇంజన్లను వీల్స్ దగ్గర అమర్చారు. దీంతో ఎలక్ట్రిక్ కారులా ఇది రోడ్డుపై కూడా ప్రయాణిస్తుంది.


Published Feb 25, 2025 04:52:00 PM
postImages/2025-02-25/1740482671_k2e03esoas625x30022February25.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: వెహికల్స్ రద్దీ చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కార్లు కొనడం చాలా ఈజీ  అయిపోయింది.. కాని ట్రాఫిక్ కష్టాలకు ...ఫుల్ స్టాప్ పెట్టడానికి ఓ కొత్త ఇన్వెన్షన్ ను పరిచయం చేసింది.  దీంతో ఇటువంటి చిక్కుల నుంచి తప్పించుకోవడానికి ఎగిరే కారును అభివృద్ధి చేయాలని ఇంజనీర్లు చాలా కాలంగా ప్రయత్నాలు జరుపుతున్నారు. అమెరికాకు చెందిన ఓ సంస్థ నిజం చేస్తోంది. ఆ దేశంలోని అలెఫ్‌ ఏరోనాటిక్స్‌ కంపెనీ  గాల్లో ఎగిరే ఈ కారును అభివృద్ధి చేస్తోంది. ఈ కారు రోడ్డుపై వెళ్లగలదు. గాల్లోను ఎగురగలదు.  ఈ కార్ లో నాలుగు చిన్న ఇంజన్లను వీల్స్ దగ్గర అమర్చారు. దీంతో ఎలక్ట్రిక్ కారులా ఇది రోడ్డుపై కూడా ప్రయాణిస్తుంది.


ఈ జీరో కారులో ఖాళీగా ఉండే బానెట్, డిక్కీలో 8 ప్రొపెల్లర్లు ఉంటాయి. అవి వేర్వేరు వేగాలతో తిరుగుతాయి, ఈ చిన్న చిన్న ఇంజన్లు వల్ల కారును ఎంత ఎత్తులో అయినా మనకు నచ్చినట్లు కారును తిప్పుకోవచ్చు. ఈ కారులో ఫ్రేమ్ కోసం కార్బన్ ఫైబర్ వాడారు. దీంతో ఈ కారు బరువు 385 కిలోలుగా ఉంది. ఈ కారు గాలిలో దాదాపు 177 కిలోమీటర్లు ప్రయాణించగలదు.


రోడ్డుపై మాత్రం 56 కిలోమీటర్లు దూరం మాత్రమే వెళ్తుంది. ప్రపంచంలో ఇప్పటికే ఫ్లయింగ్‌ కార్లు ఉన్నాయి. ఈ జీరో కారు మాత్రం వాటికంటే భిన్నమైనది. ఇప్పటికే ఉన్నకార్లు టేకాఫ్ టైంలో రోడ్డును రన్ వేలాగా వాడుకుంటాయి. ఈ జీరో కారు మాత్రం రోడ్డుపై నిట్టనిలువుగా దిగగలుగుతుంది. ఈ కారును సాధారణ జనాలు సులువుగా వాడుకోవచ్చు. ఈ కారు ధర దాదాపు 2.57 కోట్లు ఉంటుంది.


 

Related Articles