తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ , పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ , పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్ లు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. దీంతో ఎనిమిది కార్ల మందు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన విషయం తెలిసి మరో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కు ఫోన్ చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు బయలుదేరారు. ఈ క్రమంలో గరిడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూసి మంత్రి.. కారు ఆపాలని సూచించడంతో డ్రైవర్ బ్రేక్ వేశాడు. సడన్ బ్రేక్ వేయడంతో మిగిలిన కాన్వాయ్ ఒకదానికి ఒకటి ఢీ కొట్టాయి. దీంతో కాన్వాయ్ లోని ఎనిమిది కార్లు ముందు భాగాలు దెబ్బతిన్నాయి.
ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాన్వాయ్ లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ తిరిగి బయలుదేరారు. విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి ఉత్తమ్ కుమార్ ను పలకరించారు.