ఈ విషయాన్ని తొక్కిపెట్టి బయటకు పొక్కకుండా విద్యార్థులను బెదిరించారట ప్రిన్సిపల్.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగిందని సమాచారం . దాదాపు 84 మంది విద్యార్ధులకు అస్వస్థత గురయ్యారట. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని కందుకూరు గురులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 84 మంది విద్యార్థులకు అస్వస్థత చోటు చేసుకుందట. ఈ విషయాన్ని తొక్కిపెట్టి బయటకు పొక్కకుండా విద్యార్థులను బెదిరించారట ప్రిన్సిపల్.
జనవరి 26 న గణతంత్ర దినోత్సవం సంధర్భంగా విద్యార్ధులందరికి స్వీట్లు వడ్డించగా వాటిని తిన్న విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారట. హాస్టల్లోనే నర్సు సాయంతో వైద్యం చేయించేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్. ఈ క్రమంలో కొంతమంది పరిస్థితి సీరియస్ కావడంతో వనస్థలిపురం ఏరియా హాస్పటిల్ కు తరలించడంతో ఈ విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు వెంటనే వెళ్లగా గురుకులానికి తాళం వేసి వాళ్లను అడ్డుకున్నారట ప్రిన్సిపల్.
తర్వాత పోలీసులను పిలిపించిన తర్వాత తల్లితండ్రులను లోపలికి వదిలారట. అయితే పిల్లలకు ఆరోగ్యం బాలేకపోవడం ఇంట్లో చెప్పకపోవడంపై తల్లితండ్రులు సీరియస్ అవుతున్నారు. కనీసం సమాచారం ఇవ్వడం వారి ప్రాధమిక కర్తవ్యం ప్రిన్సిపల్ చెయ్యడం కరెక్ట్ కాదంటున్నారు తల్లితండ్రులు.