సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గణతంత్రవేడుకల సంధర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు . సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈ సారి ప్రత్యేకత .
ఈ ఏడాది స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ ఇతివృత్తంతో ఈసారి కవాతులో పాల్గొనే శకటాలకు రూపకల్పన చేశారు. బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్ రాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్లు మేర రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాటు చేశారు.
త్రివిధదళాల అధిపతులతో కలిసి ఇండియా గేట్ సమీపంలోని జాతీయ యుద్ధస్మారకం వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ , రాష్ట్రపతి పార్టీ నాయకుల సమక్షంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసిన అనంతరం ప్రధాని మోదీ కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు.