Gold Rate : పెరిగిన బంగారం, వెండి ధరలు

 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,566గా కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 71,630కి చేరింది. 


Published Aug 14, 2024 07:45:00 AM
postImages/2024-08-14/1723601822_gold.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, అమ్మకాలు దూసుకుపోతున్నాయి. దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 65,660కి చేరింది.  1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,566గా కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 71,630కి చేరింది. 


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,810గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,780గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,660 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 71,630గా ఉంది. దాదాపు మెట్రో పాలిటన్ సిటీస్ అన్నింటిలోను ఇదే ధర నడుస్తుంది. చెన్నైలో మాత్రం  22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,660గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,630గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 65,660 గా నమోదయ్యింది.


హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,660గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,630గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. అహ్మదాబాద్ , భువనేశ్వర్ లోను ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 88,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 83,600.. బెంగళూరులో రూ. 80,100గా ఉంది.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu goldrates silver-rate

Related Articles