America: నా క్లాస్ అంతా ఇండియన్సే...వాళ్లకి క్లాస్ లో ఎలా బిహేవ్ చెయ్యాలో కూడా తెలీదు!

కాని ఇక్కడంతా ఇండియన్సే. ఇదేమైనా స్కామా అర్ధం కావడం లేదంటూ ట్విట్ చేసింది.


Published Nov 16, 2024 02:10:00 PM
postImages/2024-11-16/1731746553_happyafricanamericanfemalestudent600nw2345738157.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : అమెరికా లో మాస్టర్స్ చేయడానికి ఇండియన్స్ చాలా ఎక్కువగా వెళ్తున్నారట. ఈ విషయం మనవాళ్లు చెప్తున్నది కాదు..ఓ అమెరికన్ అమ్మాయి ఈ టాపిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందిద. నా క్లాస్ అంతా భారతీయులే ఉన్నారు మాదేం పెద్ద టాప్ యూనివర్సిటీ కాదు. కాని ఇక్కడంతా ఇండియన్సే. ఇదేమైనా స్కామా అర్ధం కావడం లేదంటూ ట్విట్ చేసింది.


 అమెరికాలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ లో ఓ యువతి చేసిన పోస్టు ప్రస్తుతం చర్చకు దారితీసింది. అమెరికాలో పుట్టిపెరిగిన 26 ఏళ్ల యువతినంటూ చెప్పుకున్న సదరు యూజర్.. తాను కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ కోసం ఓ సాధారణ యూనివర్సిటీ కాలేజీలో చేరానన్నారు. కాని మొదటి రోజు క్లాస్ కు వెళితే షాక్ అయిపోయానని... అందరు ఇండియన్సే ఉన్నారని నేనే అక్కడ ఇండియాలో ఉన్నట్లు ఫీలయ్యానని తెలిపింది. 


ఇంతమంది ఇండియన్లు నిజంగా అమెరికాకు మాస్టర్స్ డిగ్రీ కోసమే వచ్చారా.. ఇక్కడ ఉద్యోగం సంపాదించుకుని, వీసా పొందాలని వచ్చే వారు చాలామంది నెలల తరబడి ఉద్యోగాల కోసం వెతుకుతున్నా దొరకడంలేదని చెప్పింది. ఇక్కడ మీరనుకున్నంత ఉద్యోగాలు లేవు. కొంతమంది ఇండియా తిరిగి వెళ్లలేక ... వారి పరిస్థితి చూస్తే, భవిష్యత్తుపై వారి ఆశలు వింటుంటే తనకు వారిపై జాలి కలుగుతోందని చెప్పింది.  ఎడ్యుకేషన్ లోన్లు సులభంగా లభించడంతో పాటు యూనివర్సిటీల దరఖాస్తు విధానాలను సరళీకృతం చేయడమూ ఓ కారణమేనని వివరించారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu students viral-news america socialmedia education

Related Articles