అమెరికా వాషింగ్టన్‌లోని లాంగ్‌వ్యూలోని ఇంట్లో భార్యభర్తలిద్దరు చాలా కాలంగా గొడవలు పడుతున్నారు. అయితే ఆ రోజు గొడవ తారాస్థాయికి చేరుకొని ఒకరిని ఒకరు కొట్టుకొని చనిపోయారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ప్రపంచం ఎటు పోతుంది రా నాయనా...ఒకప్పుడు పేరెంట్స్ కొట్టుకుంటే పిల్లలు మొహాలు బిక్క మొహాలై...ఏడుపు చూసైనా తల్లితండ్రులు ఒకటయ్యే వారు. కాని ఇప్పుడు పిల్లలు మొహాలు పేరెంట్స్ చూసే అవకాశమే లేదు. వాళ్లు ఎప్పుడు సోషల్ మీడియా భూతంతోనే గడుపుతున్నారు. అమెరికాలో ఓ ఘటన పిల్లలు వీడియో గేమ్స్ కు ఎంత అడిక్ట్ అవుతున్నారో తెలుపుతుంది.
అమెరికా వాషింగ్టన్‌లోని లాంగ్‌వ్యూలోని ఇంట్లో భార్యభర్తలిద్దరు చాలా కాలంగా గొడవలు పడుతున్నారు. అయితే ఆ రోజు గొడవ తారాస్థాయికి చేరుకొని ఒకరిని ఒకరు కొట్టుకొని చనిపోయారు. కాని పక్క రూమ్ లో ఉన్న తమ 11ఏళ్ల కొడుకు మాత్రం ఇదంతా వినిపించలేదు. కారణం వీడియో గేమ్స్ ఆడుతున్నాడు.వాడికి వీడియో గేమ్ తప్ప బయటప్రపంచంలో ఏమైపోతుందో తెలీలేదు. అప్పటికి ...ఆట ముగిసిపోవడంతో ..బయటకు వచ్చి చూస్తే రూమ్ నుంచి రక్తం బయటకు వస్తుంది. అది చూసి బాలుడు 911 కి ఎమర్జెన్సీ కాల్ చేశాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల సమీపంలో కత్తితో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే దంపతులిద్దరూ గొడవకు దిగి ఒకరినొకరు దాడి చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతి చెందిన భార్యాభర్తలను జువాన్ ఆంటోనియో అల్వరాడో(38), సిసిలియా రోబుల్స్(39)గా గుర్తించారు. అయితే గొడవ జరుగుతున్నపుడే ఆ కుర్రాడు రెస్పాండ్ అయ్యి ఉంటే పేరెంట్స్ చనిపోయి ఉండేవారు కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.