న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఉద్యోగులకు బోనస్ ఇచ్చే విషయం లో ఓ కంపెనీ కాస్తంత వెరైటీ గా ఆలోచించింది. చైనాకు చెందిన హెసస్ మైనింగ్ క్రేన్ కో.లిమిటెడ్ అనే సంస్థ ఇలా తన ఉద్యోగుల కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. 70 మీటర్ల పొడవు ఉన్న ఓ టేబుల్ మీద రూ. 70 కోట్లు పరిచింది. అప్లై సంస్థలోని ఉద్యోగులను 30 టీమ్స్ విభజించింది.
తర్వాత ఒక్కో టీం నుంచి ఇద్దరు వచ్చి 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే ఆ మొత్తం బోనస్ గా తీసుకోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించిన వీడియో డౌయిన్ , వీబో వంటి చైనీస్ సోషల్ మీడియా సైట్ లలో మొదట దర్శనమిచ్చింది. ఉద్యోగులు అసలు పిచ్చ క్రేజీ గా లెక్కపెట్టారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలోకి రావడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. కాగా ...ఓ ఉద్యోగి అత్యధికంగా రూ. 12.07 లక్షలు లెక్కించినట్లు తెలిసింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.