మనం ఆడవారికి ఉచిత బస్సు, ఉచిత కరెంట్ , లేడీస్ కు నెలకు రూ. 2 వేలు ఇస్తున్నాం. మరి మగవారికి ఏం లబ్ధి లేదు ..అందుకే వారికి కూడా వారానికి రెండు బాటిళ్ల మద్యం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు జేడీఎస్
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కర్ణాటక అసెంబ్లీలో ఓ సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే విచిత్రమైన డిమాండ్ ను చేశారు. సార్ డిమాండ్ కు ..అక్క ప్రజాప్రతినిధులే కాదు విన్న జనాలు కూడా షాక్ అయ్యారు. మగజాతి కోసం చాలా ఆలోచించి ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారు. మద్యం తాగే వారు కట్టే ట్యాక్సులతోనే కదా ..మనం ఆడవారికి ఉచిత బస్సు, ఉచిత కరెంట్ , లేడీస్ కు నెలకు రూ. 2 వేలు ఇస్తున్నాం. మరి మగవారికి ఏం లబ్ధి లేదు ..అందుకే వారికి కూడా వారానికి రెండు బాటిళ్ల మద్యం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు జేడీఎస్ ఎమ్మెల్యే కృష్ణప్ప డిమాండ్ చేశారు.
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని రూ.36,500 కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచారన్నారు. ఇందుకోసం ట్యాక్సులు పెంచండి. ఏమైనా చెయ్యండి. నా తమ్ముళ్లకు న్యాయం జరగాలంటూ కామెంట్ చేశారు. ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మహిళా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత, ఇంధన మంత్రి కె.జె జార్జ్ స్పందిస్తూ దీన్ని మీరు ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అమలు చేయండని సూచించారు. ఏం ఆలోచన లేకుండా ఏదో చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. వారి పార్టీ భవిష్యత్తులో ఓట్ల కోసంఉచిత మద్యం హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదనే కామెంట్స్ వినబడుతున్నాయి.