trimurthulu వార్తలు

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి, అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ నాగార్జున స్టార్ హీరోలుగా ఎదిగారు. అలాంటి బాలకృష్ణ నాగార్జున కలిసి  ఒక చిత్రంలో నటించారు. ఆ సినిమా ఏంటి ఆ వివరాలు చూద్దాం. బాలకృష్ణ, నాగార్జున మధ్య గొడవలు ఉన్నాయని అనేక వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మరి వీరి మధ్య ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అందులో నిజం ఎంత అనే విషయానికి వస్తే..నాగార్జున మరియు బాలకృష్ణ కలిసి ఒక చిత్రం చేశారు. ఆ చిత్రం పేరు త్రిమూర్తులు.

ఈ మూవీలో బాలకృష్ణ నాగార్జున కలిసి కనిపించారు.  వెంకటేష్ హీరోగా చేసినటువంటి ఈ మూవీలో బాలకృష్ణ గెస్ట్ రోల్ లో చేసినట్టు తెలుస్తోంది. 1987లో ఈ మూవీ విడుదల అయింది. ఈ చిత్రంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, కృష్ణ, శోభన్ బాబు, విజయశాంతి, చంద్రమోహన్, మురళీమోహన్, పద్మనాభం, రాధా, భాను, శారదా, జయమాలిని, అనురాధ ఇలా చాలామంది గెస్ట్ లుగా వచ్చారు. కానీ ఈ చిత్రం  వారు అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. అలాంటి ఈ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.

advertisement