అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు సమీపంలో చాలా గుడారాలకు అంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు.
'సెక్టార్ 19లో గీతా ప్రెస్ టెంట్‌లోని ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు మంటలు చెలరేగాయి. సమీపంలోని 18 టెంట్లకు మంటలు వ్యాపించాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గంగమ్మ దయతో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక పై మరింత జాగ్రత్తగా ఉంటామని తెలిపారు.
ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆరా తీశారు. అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగినా 20 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 100 మంది చుట్టుపక్కలే ఉన్నారని, వారికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.