రానున్న వందల యేళ్లలో ఎప్పుడో ఒకసారి ఈ రెండు ఢీ కొట్టుకొని కలిసిపోతాయంటున్నారు నాసా .
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: విశ్వం ఎంత అధ్భుతమైదంటే ...అంత కంటే వెయ్యి రెట్లు అందమైనది. వందల కోట్ల గెలాక్సీలు , వేల కోట్ల నక్షత్రాలతో అందంగా ఉంటుంది. ఇక అంతరిక్షంలో మనకు అన్నింటికన్నా దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా. ఇవి రెండూ మెల్లగా ఒకదానికి మరొకటి దగ్గరగా వస్తున్నాయని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. రానున్న వందల యేళ్లలో ఎప్పుడో ఒకసారి ఈ రెండు ఢీ కొట్టుకొని కలిసిపోతాయంటున్నారు నాసా .
అంతరిక్షంలో తిరుగాడుతున్న ప్రతిష్టాత్మక హబుల్ టెలిస్కోప్ తో ఈ గెలాక్సీని పదేళ్లుగా చిత్రీకరిస్తూ వచ్చారు. అలా చిత్రీకరించిన చిత్రాలన్నీ కలిపి అత్యంత పెద్ద చిత్రం ఒకదానిని తాజాగా రూపొందించారు. ఏకంగా 250 కోట్ల పిక్సెల్స్ తో రూపొందిన ఈ చిత్రంలో సుమారు 20 కోట్ల నక్షత్రాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇది కూడా ఆ గెలాక్సీలో కొంత భాగం మాత్రమేనని చెబుతున్నారు. నాసా దీనిని రిలీజ్ చేసింద. సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్ గా వైరల్ అవుతుంది. అందంగా ఉండడమే కాదు ...చాలా అధ్భుతంగా ఉంది.