Aadhi Pinisetty : విడాకుల బాటలో మరో జంట..ఆదిపినిశెట్టి ఏమన్నాడంటే !

వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీని పై ఆదిపినిశెట్టి స్పందించాడు.


Published Feb 27, 2025 12:51:00 PM
postImages/2025-02-27/1740640927_aadhinikki19112022c.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఆదిపినిశెట్టి తెలియని తెలుగు వారు లేరు. మంచి నటుడుగా తెలుగులో తన స్థానం సంపాదించుకున్నాడు. అయితే రీసెంట్ గా  తన భార్య హీరోయిన్‌ నిక్కీ గ‌ల్రానీని ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీని పై ఆదిపినిశెట్టి స్పందించాడు.


ఆ వార్త‌ల‌ను చూసి తాను ఎంతో బాధ‌ప‌డిన‌ట్లు చెప్పుకొచ్చాడు. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయి. త‌న కుటుంబానికి ఆమె ఎంతో చేరువైంద‌న్నాడు. అదే స‌మ‌యంలో మా కుటుంబం కూడా ఆమెకు ఎంతో న‌చ్చింది. పెద్దలందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. కాని మీరు చూస్తే విడిపోతున్నామంటూ వార్తలు రాస్తున్నారు. ఇది చాలా అన్యాయం. చాలా యూట్యూబ్ ఛాన‌ళ్ల‌లోని పాత వీడియోల‌ను చూశాను. ఆ త‌రువాత ఇలాంటి వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని నిర్ణయించుకున్నాను.’ అంటూ ఆదిపినిశెట్టి తెలిపారు. కాని చాలా భాదపడ్డాను.


రంగస్థలం మూవీ త‌న‌కు తెలుగుతో పాటు త‌మిళంలో మంచి పేరు తెచ్చిన‌ట్లు ఆది చెప్పుకొచ్చాడు. ఆ మూవీలో ఓ సీన్‌లో తాను చ‌నిపోయిన‌ట్లు యాక్టింగ్ చేశాన‌ని, అప్పుడు చుట్టు ఉన్న న‌టీన‌టుల యాక్టింగ్ చూసి నిజంగా తాను భ‌య‌ప‌డిన‌ట్లు చెప్పాడు. తను ఏ స్థాయిలో నటించడానికి చుట్టు ఉన్న యాక్టర్సే కారణమన్నారు. అయితే తన రీసెంట్ సినిమా ‘శబ్దం’ . ఫిబ్రవరి 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్న ఆది పై విష‌యాల‌ను మాట్లాడారు. ఈ చిత్రానికి అరివళగన్‌ దర్శకత్వం వ‌హిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu divorce youtubechannel

Related Articles