న్యూస్ లైన్ , స్పెషల్ న్యూస్ : ప్రముఖ సినీ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు రాజబాబు కన్నుమూశారు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. హైదరాబమాద్ లోని ఆయన నివాసంలో గురువారం మధ్యాహ్నం రాజబాబు మరణించినట్లు జయప్రద తెలిపారు."నా అన్నయ్య రాజబాబు మరణవార్తను మీకు తెలియజేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఈరోజు మధ్యాహ్నం 3.26 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడికి ప్రార్ధించండి. అంటూ పోస్ట్ చేశారు. ఇండస్ట్రీ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ జయప్రద ను పలకరిస్తున్నారు.