Chef Mantra Project K : ఆహాలో సుమ కుకింగ్ షో.. ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K’ ప్రొమో!

తాజా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్-కె తో ఆడియెన్స్ ను అల‌రించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని యాంకర్ సుమ హూస్ట్ చేస్తుంది. కమెడియన్ జీవన్ జడ్జి వచ్చారు.


Published Feb 28, 2025 01:12:00 PM
postImages/2025-02-28/1740728636_chefmantraprojectk1739945173.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా గురించి తెలుగు ప్రేక్షకులకు ఓ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబం అంతా కలిసి చూసేలా ..వైవిధ్యమైన మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ,వెబ్ సీరిస్ టాక్ షోలతో ప్రేక్షకులకు ఎంతో చేరువైంది.


తాజా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్-కె తో ఆడియెన్స్ ను అల‌రించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని యాంకర్ సుమ హూస్ట్ చేస్తుంది. కమెడియన్ జీవన్ జడ్జి వచ్చారు. ఇక ఈ షో మార్చి 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రొమోను విడుదల చేశారు. తొలి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్,  అంబటి అర్జున్ , పృథ్వీ , విష్ణు ప్రియ, సుప్రీత , దీపిక ,యాదవ్ రాజులతో పాటు ఇద్దరు యూట్యూబ్ స్టార్స్ లు పాల్గొన్నారు. సుమ తనదైన టైమింగ్ తో పంచులతో అదరగొట్టింది.


ఈ స్టార్స్ చేసిన వంటను రుచి చూసేందుకు జడ్జిగా వచ్చిన జీవన్ ఇబ్బందిపడ్డాడు. మొత్తంగా ప్రొమో మాత్రం అదిరిపోయింది. ఇక షో ఫస్ట్ ఎపిసోడ్ మార్చి 6న రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు ఒక కొత్త ఎపిసోడ్ రానున్నట్లు తెలిపారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu anchor-suma

Related Articles