Prudhvi Raj: సినీ నటుడు పృథ్వీకి అస్వస్థత !

చివరి సీన్ లో తనను జైలు నుంచి రిలీజ్ చేస్తారని, అప్పుడు లెక్కిస్తే 11 మేకలు ఉన్నాయని ఆయన కామెంట్ చేశారు. 


Published Feb 11, 2025 08:15:00 PM
postImages/2025-02-11/1739285170_pridvi1200x675xt.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కి ఆరోగ్యం బాలేదు. హైబీపీతో రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే రీసెంట్ గా లైల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో 150 మేకలు ఉంటాయని.. చివరి సీన్ లో తనను జైలు నుంచి రిలీజ్ చేస్తారని, అప్పుడు లెక్కిస్తే 11 మేకలు ఉన్నాయని ఆయన కామెంట్ చేశారు. 


అయితే గతంలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆ సంఖ్య 11కి పడిపోయిందని కమెంట్ చేశారు. కాని సినిమా ప్రమోషన్స్ లో ఎందుకు ఈ కామెంట్లు చేశారో తెలీదు. దీనికి గాను ఆ పార్టీ వర్గాలు సీరియస్ అవ్వడమే కాదు...హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. దీనికి విశ్వక్ సేన్ రిప్లై కూడా చేశారు. మా సినిమా లో ఏ పార్టీని మేం ఇన్వాల్వ్ చెయ్యలేదని ..అసలు పృథ్వీకి ఇలా మేకలు కాన్సప్ట్ తో డైలాగులే లేవని ...ఎందుకు ఇలా మాట్లాడారో తెలీదంటూ పోస్ట్ చేశారు. క్షమాపణలు కూడా చెప్పాడు. ఈ సినిమాలో పృథ్వీ ఒక నటుడు మాత్రమేనని, ఆయన మాటలు పట్టించుకోవద్దని కోరారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu vishwak-sen pruthvi laila

Related Articles