ఒక షెడ్యూల్ కూడా అయిపోయిందని టాక్ . విలేజ్ యాక్షన్ డ్రామా అంటున్నారు.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ ఛేంజర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మిక్స్డ్ టాక్ తో పర్వాలేదనిపించింది. అయితే రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాపై అప్పుడే టాక్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా చేస్తున్నాడు.
షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఒక షెడ్యూల్ కూడా అయిపోయిందని టాక్ . విలేజ్ యాక్షన్ డ్రామా అంటున్నారు.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా తర్వాత RC17 సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మొదలవుతుంది. rc18పై అప్పుడే డిస్కర్షన్స్ జరుగుతున్నాయి.
తాజాగా రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఓ బాలీవుడ్ డైరక్టర్ తో అని బాలీవుడ్ మీడియా తెగ వార్తలు రాసుకుంటుంది. బాలీవుడ్ లో కిల్ అనే సూపర్ హిట్ యాక్షన్ సినిమాను డైరక్ట్ చేసిన నగేష్ భట్ డైరక్షన్ లో రామ్ చరణ్ సినిమా ఉంటుందని టాక్. ఈ సినిమాని బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మధు మంతెన నిర్మిస్తాడని మీడియా కథనాలు. అయితే మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో భారీగా ఈ సినిమాను తీస్తున్నారట. ఈ సినిమాకు మాటలు అయిపోయాయని ..అపిషియల్ గా అనౌన్స్ చెయ్యాల్సి ఉందని అంటున్నారు.