Jhony Master: జానీ మాస్టర్ పై యాంకర్ ఝాన్సీ ట్వీట్ !

ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయంపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.


Published Jan 29, 2025 12:55:00 PM
postImages/2025-01-29/1738135587_JaniMasterVgif442x2604g.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: లేడీ కొరియాగ్రఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి  బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయంపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఈ విషయాన్ని యాంకర్, ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్ కమిటీ మెంబర్ ఝాన్సీ ఓ పోస్టులో వెల్లడించారు. 


ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలను సవాలు చేస్తూ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెట్టుకున్న మధ్యంతర పిటిషన్ ను జిల్లా కోర్టు కొట్టేసిందని ఝాన్సీ తన పోస్టులో తెలిపారు. ఇది చాలా ఇంపార్టెంట్ తీర్పు అని , పనిచేసే  ప్రదేశాల్లో మహిళల సెక్యూరిటీ చాలా ప్రాధాన్యత ఉందని కోర్టు మరోసారి రుజువు చేసిందంటూ కామెంట్ చేశారు. ఈ విషయం లో ధర్మం వైపు నిలబడి పోరాటం చేసిన తెలుగు ఇండస్ట్రీ వాణిజ్య మండలికి ధన్యవాదాలు అంటూ పోస్టు చేశారు.


తనను డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయంపై జానీ మాస్టర్ మండిపడ్డారు. తన పై ఉన్న కేసు ఇంకా విచారణ జరుగుతుందని తీర్పు రాకుండా తనను దోషి ని చేయడం కరెక్ట్ కాదని అన్నారు. తాను నేరం చేశానని ఇంకా రుజువు కాకుండానే చర్యలు తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ జానీ మాస్టర్ కోర్టుకెక్కారు. జానీ మాస్టర్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తాజాగా కొట్టివేసిందని ఝాన్సీ తన పోస్టులో వెల్లడించారు. ఇప్పుడు ఈ పోస్ట్ చాలా వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu anchor johnmaster

Related Articles