ఈ సంఘటన వైట్ హౌస్ కు 5 కిలోమీటర్లు దూరంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అమెరికాలో విమానం , హెలికాప్టర్ ఢీ కొన్న ఘటనలో నదిలో నుంచి 18 మృతదేహాలను వెలికి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వివరించారు. అయితే ప్రమాదం జరిగే సమయంలో విమానంలో సిబ్బంది సహా 64 మంది , ఆర్మీ హెలికాప్టర్ లో ముగ్గురు సైనికులు ఉన్నారని చెప్పారు. ఈ సంఘటన వైట్ హౌస్ కు 5 కిలోమీటర్లు దూరంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు.
వాషింగ్టన్ లోని ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే క్రమంలో పీఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ను ఢీ కొట్టింది. దీంతో గాల్లోనే రెండు ముక్కలైన విమానం పోటోమాక్ నదిలో పడిపోయింది. హెలికాప్టర్ కూడా నిట్టనిలువుగా నదిలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది.
ఆ సమయంలో నదిలో నీటి ఉష్ణోగ్రత -1 నుంచి -2 డిగ్రీలు ఉండొచ్చని అధికారులు చెప్పారు. నదిలో పడిపోయిన విమానంలోని ప్రయాణికులలో ఎవరైనా బతికి బట్టకట్టే అవకాశం తక్కువని అన్నారు. గాయాలకు తోడు గడ్డకట్టించే చలి కారణంగా వారి శరీర ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయి అరగంటలోపే మృత్యువాత పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.