ఇప్పుడు పుట్టిన బిడ్డ నాల్గవ బిడ్డ. నాల్గో బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా శివోన్ జిలిస్ తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టెస్లా సీఈవో , బిలీయనీర్ ఎలాన్ మాస్క్ మరోసారి తండ్రి అయ్యాడు. ఇప్పటికే ఆయనకు 13 మంది పిల్లలకు తండ్రి అయ్యాయి. 14 వ బేబీకి స్వాగతం పలికారు. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ , ఎలాన్ మస్క్ వైఫ్ శివోన్ జలిస్ కు మగబిడ్డ పుట్టాడు. అయితే మస్క్ జలిస్ ఇప్పటికే ముగ్గురు బిడ్డలను కలిగి ఉన్నారు. ఇప్పుడు పుట్టిన బిడ్డ నాల్గవ బిడ్డ. నాల్గో బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా శివోన్ జిలిస్ తెలిపారు. ఈ ట్వీట్ ను ఓ లవ్ సింబల్ తో ట్యాగ్ చేసింది.
తన మూడవ బిడ్డ పుట్టినరోజు సంధర్భంగా ఈ విషయాన్ని తెలియజేయలని ఎలెన్ మస్క్ తో చర్చించామని తెలిపారు.అందమైన ఆర్కాడియా పుట్టినరోజు దృష్ట్యా మా అద్భుతమైన కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ గురించి నేరుగా పంచుకోవడం మంచిదని మేము భావించాము’’ అని పేర్కొంది. బంగారం లాంటి నా పిల్లలను తను ప్రేమిస్తున్నట్లు తెలిపారు. 2021లో మస్క్ జిలిస్ తో కవలలకు తండ్రి అయ్యాడు. 2024లో జిలిస్ మూడవ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా జిలిస్ నాల్గో బిడ్డకు జన్మనిచ్చింది.