మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయని ఈ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మరో వైపు దేశవ్యాప్తంగా జరగాల్సిన సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్ - పాక్ నెలకొన్న ఉద్రిక్తతల మధ్య పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ( ఐసీసీఐ) ప్రకటించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయని ఈ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
దీనికి సంబంధించిన సమాచారం కోసం పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్ధులు ICAI వెబ్ సైట్ icai.org లో అధికారిక నోటీసును తనిఖీ చేసుకోవాలని సూచించింది. మునుపటి షెడ్యూల్ ప్రకారం CA పరీక్షలు మే2 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్ధులకు CA ఇంటర్ పరీక్ష మే 3,5, 7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు మే 9,11,14 తేదీల్లో జరగాల్సి ఉంది. గ్రూప్ 1 తుది పరీక్ష మే 2, 4, 6 తేదీల్లో నిర్వహించగా, గ్రూప్ 2 పరీక్ష మే 8, 10, 13, తేదీలలో జరగాలి.