'ఎస్‌కే 23' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్ ను విడుదల చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: రీసెంట్ గా అమరన్ సినిమాతో తమిళ్ హీరో శివకార్తీకేయన్ భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. సాయిపల్లవి హీరోయిన్ గా చేసిన ఈ మూవీ రీసెంట్ అన్ని లాంగ్వేజెస్ లో సూపర్ హిట్ కొట్టింది. డైరక్టర్ ఏ ఆర్ మురుగదాస్ తో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు శివకార్తీకేయన్.'ఎస్‌కే 23' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈరోజు శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'మదరాసి' అనే పవర్‌ఫుల్ టైటిల్ ను పెట్టారు మేకర్స్. తాజాగా రిలీజైన గ్లింప్స్ లో శివకార్తికేయన్ మునుపెన్నడూ చూడని భయంకరమైన కొత్త లుక్ లో కనిపించారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామోన్ చాలా అధ్భుతమైన విజువల్స్ యాక్షన్ ఎలివేట్ చేయగా అనిరుధ్ రవిచంద్రన్ బీజీఎం దాన్నిమరో స్థాయికి తీసుకెళ్లారు.
మొత్తానికి టైటిల్ గ్లింప్స్ తో మేకర్స్ చిత్రంపై అంచనాలు పెంచేశారు. రుక్మిణి వసంతన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో విద్యుత్ జమాల్, బీజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శివకార్తీకేయన్ మార్కెట్ చాలా బాగుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అయితే శివకార్తీకేయన్ రేంజ్ మారినట్లే అంటున్నారు నెటిజన్లు.