BANGLADESH: షేక్‌ హసీనా తండ్రి ఇంటికి నిప్పంటించిన ఆందోళనకారులు !

షేక్ హసీనా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్న టైంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై హసీనా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  


Published Feb 05, 2025 11:26:54 PM
postImages/2025-02-06/1738819558_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : బంగ్లాదేశ్ లో నిరసనకారులు మరోసారి రెచ్చిపోయారు. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి , బంగబంధుగా పేరొందిన ముజిబుర్ రెహమాన్ ఇంటికి నిప్పంటించారు. అది కూడా షేక్ హసీనా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్న టైంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై హసీనా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  


మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అవామీ లీగ్ పార్టీకి షేక్ హసీనా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో షేక్ హసీనా ప్రసంగిస్తే బుల్డోజర్ ఊరేగింపు నిర్వహించాలని నిరసనకారుల పోస్ట్ లు పెట్టారు. అయితే  షేక్ హసీనా వర్చువల్ గా పాల్గొన్నారు. అందుకు ముజిబుర్ ఇంటికి నిప్పంటించారు

.
బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటాన్ని హసీనా తండ్రి భారత్‌ సాయంతో పూర్తిచేశారు. 1975 లో ఆయన అధికార నివాసంలో ఉండగా సైన్యం దాడి చేసి ఆయనతో సహా ఇంట్లో వారిని చంపేసింది. రహ్మన్‌తో సహా ఆ కుటుంబంలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో హసీనా, ఆమె సోదరి రెహనా జర్మనీలో ఉండటం వల్ల బతికిపోయారు. బంగ్లా చరిత్రలో ముజిబుర్‌ నివాసం ఒక ఐకానిక్‌ చిహ్నాంగా గుర్తింపు పొందింది. అవామీ లీగ్‌ పాలనలో దీన్ని మ్యూజియంగా మార్చారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bangladesh ex-pm

Related Articles