Ascaris Lumbricoides : కడుపులోనే పెరిగే పాములతో జాగ్రత్త.. ప్రాణాలకే ముప్పు

Published 2024-07-04 13:16:22

postImages/2024-07-04/1720079182_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చిన్నపిల్లల్లో  నులుపురుగులు చాలా కామన్...సిరప్ లతో పోతాయి. కాని అస్కారియాసిస్ అంటే ...కడుపులో పెరిగే పాములు...ఇవి పెద్ద వారిలో కూడా చాలా కామన్ గా కనిపిస్తాయి. వీటి వల్ల ఆరోగ్యసమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఆరు నెలలకు ఓ సారి ఈ పాములకు సిరప్ వాడాల్సిందే . పదేళ్ల లోపు చిన్నారులకు ...ఈ నులిపురుగుల ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది.


మీరు నమ్ముతారా ..ఈ నులిపురుగులు ఎక్కువై...ప్రతి యేటా 60 వేల మంది చిన్నారులు చనిపోతున్నారు. కేవలం ఈ పురుగుల కారణంగా ..ఎన్నో ఆరోగ్యసమస్యలు కలుుగుతున్నాయి. ఇది ఓ రకమైన అంటువ్యాధి. పరిశుభ్రత, పారిశుద్ధ్యం లేని ప్రాంతాల్లో ఇది సోకి.. తీవ్ర అనారోగ్యాలకు గురి చేసి.. కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది. ఈ నులిపురుగులు సమస్య ..ప్రపంచవ్యాప్తంగా ఉండే సమస్య.ఈ పాములు లేదా పురుగులు పేషెంట్ శరీరంలో బాగా పెరిగి.. పేగులకు అడ్డంపడిపోతాయి. ఆ పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి.. వాటిని తీయాల్సి వస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేసినా.. అది ప్రాణాంతకమవుతుంది. 


* అసలు ఈ పాములు ఎలా పెరుగుతాయంటే ..
ఈ పాములు కలిగి ఉన్న వ్యక్తి బహిరంగ మలవిసర్జన చేస్తే.. ఈ పాములు మలం ద్వారా నేలలోకి చేరుతాయి. వాటి గుడ్లు కూడా నేలలోకి వెళ్తాయి. ఆ ప్రాంతంలో పెరిగే మొక్కలకి ఇవి అంటుకుపోతాయి. వాటి శుభ్రంగా కడగకుండా.. తినేవాళ్ల కడుపులోకి చేరి.. పెరుగుతాయి. ఇదే కాకుండా.. గుడ్లతో కలుషితమైన నీరు తాగడం వల్ల కూడా ఇవి మరొకవ్యక్తికి చేరుతాయి. ఈ నులిపురుగులు కనిపించిని పెద్ద ప్రమాదం. ఒక్కో సారి శరీరం అంతా గుడ్లు పెట్టేస్తుంది. దీని వల్ల ఫుడ్ డైజిస్ట్ అవ్వనివ్వదు. మానవ మలాన్ని ఎరువుగా ఉపయోగించే ప్రాంతాల్లో ఈ తరహా సమస్య వచ్చే ఆస్కారముంది. మురికిలో ఆడుకుని.. చేతులు కడగకుండా నోటిలో పెట్టుకుంటే కూడా ఇది వచ్చే అవకాశముంది.