బలిసినోళ్లు Vs బక్కన్న


Published Feb 12, 2025 11:49:56 AM
postImages/2025-02-12/1739341196_Capture.JPG

బలిసినోళ్లు Vs బక్కన్న

కరీంనగర్ పట్టభద్రుల పోరులో ఆసక్తికర పోరు

కోటీశ్వరులకు టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్, బీజేపీ

నిరుద్యోగుల పక్షాన బరిలోకి దిగిన బక్క జడ్సన్

ప్రభుత్వంపై జడ్సన్ అలుపెరుగని పోరాటం

నిరుద్యోగులు, ప్రజలే నా బలం : బక్క జడ్సన్

 

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పోరు నడుస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీపడుతున్న వారిలో కోటీశ్వరులే ఎక్కువగా ఉన్నారు. కోట్లకు పడగలెత్తిన ఆసాములతో అతి సామాన్యుడు బక్క జడ్సన్ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ బహిష్కృత నేతగా, సామాజిక కార్యకర్తగా రేవంత్ సర్కార్ తప్పిదాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న బక్క జడ్సన్ ఇప్పటికే జనంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. హైడ్రాపై ఆయన చేస్తున్న పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ద్వారా తన ఉద్యమానికి ప్రజలు మద్దతు కూడగడతానంటున్నారు బక్క జడ్సన్.

 

తెలంగాణం, స్టేట్ బ్యూరో(ఫిబ్రవరి 11): ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు ముగిసిన విషయం తెలిసిందే.  బరిలోకి దిగిన అభ్యర్థుల జాబితాను ఓసారి పరిశీలిస్తే దిమ్మతిరిగిపోతుంది ఎవరికైనా. పోటీలో పది మందికిపైగా ఉండగా.. అందులో కోటీశ్వరులు అధికంగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు టాప్ ప్లేస్‌లో ఉన్నారు. కోటీశ్వరులకే ఆయా పార్టీలు సీట్లు ఇవ్వడం విశేషం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన చిన్నమైల్‌‌ అంజిరెడ్డి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆస్తులలో ఈయనదే మొదటి స్థానం. ఈయన ఆస్తి రూ.175 కోట్లు. ఇక రూ.61 కోట్లతో రెండో స్థానంలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య ఉన్నారు. హైదరాబాద్‌‌లో విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఇక రూ.45.50 కోట్లతో మూడోస్థానంలో కాంగ్రెస్‌‌ టీచర్స్ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌‌ రెడ్డి ఉన్నారు.

 

ఈ కోటీశ్వరులతోనే బక్క జడ్సన్ పోటీ పడుతున్నారు. సామాన్యుడిగా, అసలు సిసలు కాంగ్రెస్‌వాదిగా, నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎక్కడా రాజీపడకుండా రేవంత్ సర్కార్‌పై బక్క జడ్సన్ చేస్తున్న పోరాటం పలువురి ప్రశంసలను అందుకుంటోంది. అది హైడ్రా అయినా, మూసీ సుందరీకరణ అయినా, రైతుసమస్యలైనా, నిరుద్యోగ సమస్య అయినా.. ఎక్కడా వెనకడుగు వేయకుండా ఉద్యమిస్తున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రజల కోసం చేస్తున్న పోరాటమే తనకు అసలైన గుర్తింపు అని, వారే తనను గెలిపిస్తారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు తనకు మద్దతు తెలుపుతారని ఆయన ఆశాభావంతో ఉన్నారు.

newsline-whatsapp-channel
Tags : congress karimnagar bjp government

Related Articles