earth quake: అస్సాంలో భూకంపం రిక్టర్ స్కేల్ పై 5 మ్యాగ్నిట్యూడ్స్ !

ఈ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. ఇప్పుడు అసోంలో ఎర్త్‌క్వేక్‌తో ఒక్కసారిగా అలజడి రేగింది.


Published Feb 27, 2025 12:03:00 PM
postImages/2025-02-27/1740638081_indiaearthquaketodayassammagnitude6earthquakenewslatestevg1429018.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అస్సాంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5 మాగ్నిట్యూడ్ గా నమోదైంది. మోరిగావ్ జిల్లాలో అర్ధరాత్రి 2.25 కి భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపారు. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గౌహతితో పాటు పలు చోట్ల ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. అటు భూమికి 16 కిమీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే రెండు రోజుల  క్రితమే కోల్ కత్తా దగ్గర్లో చాల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు అధికారులు.అప్పుడు కూడా ఈ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. ఇప్పుడు అసోంలో ఎర్త్‌క్వేక్‌తో ఒక్కసారిగా అలజడి రేగింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu earth

Related Articles